వరంగల్: శివనగర్ బతుకమ్మ ఆట స్థలం, బతుకమ్మ చెరువును కమిటీ సభ్యులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పరిశీలించారు. రవికుమార్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు లేకుండా బతుకమ్మ ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని అన్నారు.