NRML: కుంటాల గజ్జలమ్మ ఆలయ ప్రాంగణంలో రీడింగ్ రూమ్ నిర్మాణానికి రూ.5 లక్షలు, అంబకంటి నుండి గజ్జలమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ముధోల్ నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.