WGL: దుగ్గొండి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సత్య శారద ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను, వంట గది పరిసరాలను, టాయిలెట్స్‌ను పరిశీలించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేసారు. కంప్లైంట్ బాక్స్‌లోని ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.