మేడ్చల్: సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ ఉప్పల్ ఇంఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ మల్లాపూర్‌కు చెందిన పీ.రమాదేవి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న పరమేశ్వర్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం కింద ఎస్ఓసీ రూ.2,50,000 పత్రాన్ని మంజూరు చేయించి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.