JN: సమాజ సేవ చేయాలనుకునే ప్రతి విద్యార్థి జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)లో చేరాలని జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నరసయ్య అన్నారు. మంగళవారం ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్తోనే సమాజ సేవ జరుగుతుందని అన్నారు.