NGKL: దేశ స్వతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకోసం ప్రాణత్యాగంచేసిన పొట్టిశ్రీరాములు పేరును యూనివర్సిటీకి కొనసాగించాలని ఆర్యవైశ్య మహాసభ నేతలు కోరారు. నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహించిన మహాసభలో నేతలు మిడిదొడ్డి శ్యామ్ కుమార్, రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం పట్ల పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.