NGKL: అచ్చంపేట మండలం దేవుల తండాకు చెందిన సభవత్ బాబు నాయక్ ఈనెల 25 నుంచి 29 వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యాడు. ఈ మేరకు అఖిల భారత బాల్ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజారావు, చీఫ్ రెఫరీ రమేష్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ సంయుక్తంగా నేడు ప్రకటించారు.