BDK: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్ అన్నారు. శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 23న 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ తాసిల్దార్ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందని తెలిపారు.