KMM: చర్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డు ఆర్థిక సహకారంతో ఏఐటీయూసీ చర్ల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్‌ను జిల్లా అధ్యక్షుడు వేల్పుల మల్లికార్జున్ ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. సంక్షేమ మండలి బోర్డును ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలని చెప్పారు.