HYD: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తార్నాక శాఖ ఆధ్వర్యంలో రైల్వే డిగ్రీ కాలేజీలో భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంత ప్రముఖ శ్రీ స్వామి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్‌ని యువత స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.