MHBD: కొత్తగూడలోని గాంధీనగర్లో మల్లెల విజయ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారికుటుంబాన్ని CI బాబురావు పరామర్శించి ఆర్థికసహాయం అందించారు. అదేవిధంగా సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా వాట్సప్ గ్రూప్ ద్వారా సేకరించిన విరాళాలు రూ.లక్ష నగదు పత్రాలను CI ద్వారా బాధిత కుటుంబానికి గ్రూప్ సభ్యులు అందించారు. కార్యక్రమంలో ఎస్సైలు కుశకుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.