ASR: గూడెం కొత్తవీధి మండలంలోని బొంతువలస గ్రామానికి చెందిన మర్రి కవిత (9)అనే బాలిక పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంట్లో పడుకున్న సమయంలో బుధవారం రాత్రి పాము చిన్నారిని కాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.