NRNL: నిర్మల్‌కి చెందిన ప్రముఖ కవి ఉపాధ్యాయులు అంబటి నారాయణ సాహితి కిరీటి జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి గురువారం తెలిపారు. నిత్య కవితలు రాస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందుకుగాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈనెల 28న హైదరాబాద్‌లో ఈ అవార్డు అందిస్తామని వారు తెలిపారు.