»Whatsapp To End Support On Some Android Devices And Iphone In October Check List
WhatsApp : అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ బంద్.. ఎందుకంటే ?
ప్రముఖ మెసేంజింగ్ యాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్లలో దాని సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో కొన్నింటికి మద్దతు ఇవ్వడాన్ని వాట్సాప్ ఆపివేస్తుంది.
WhatsApp : ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్లలో దాని సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో కొన్నింటికి మద్దతు ఇవ్వడాని వాట్సాప్ ఆపివేస్తుంది. అక్టోబర్ 24 నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిచిపోనుంది. ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్లలో వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని కంపెనీ కోరుకుంటోంది. వాట్సాప్ సర్వీస్ నిలిచిపోయే Android ఫోన్లు వెర్షన్ 4.1 , అంతకంటే ముందువి. WhatsApp FAQ క్రింద ఒక అధికారిక నోట్ ప్రచురించింది.. ” ప్రతి సంవత్సరం మేము పాత సాఫ్ట్వేర్లను ఏ పరికరాలలో అమలు చేస్తున్నాము.. వాటిని ఎంత తక్కువ మంది వ్యక్తులు ఉపయోగిస్తున్నారు అని చూస్తాము. ఈ పరికరాలు తాజా భద్రతను పొందలేకపోవచ్చు. అందుకే అప్డేట్ కావాలి. అంటూ రాసుకొచ్చింది.
అయితే సర్వీస్ నిలిపివేసే ముందు కంపెనీ కస్టమర్లకు తెలియజేస్తుంది. వాట్సాప్‌ను సేవను కొనసాగించడానికి పరికరాన్ని అప్‌గ్రేడ్ చేయమని కూడా వారిని అడుగుతుంది. అక్టోబర్ 24 తర్వాత WhatsApp డెవలపర్లు సాంకేతిక మద్దతు, అప్ డేట్లను అందించడం ఆపివేస్తారు. OS ఇకపై ఆటోమేటిక్ అప్డేట్లు, ప్యాచ్‌లు, సెక్యూరిటీ ఫిక్స్‌లు లేదా కొత్త సేవలను స్వీకరించవు. అప్పుడు ఇలాంటి పరికరాలు హ్యాకర్లు, మాల్వేర్లకు సులభ మార్గాలుగా మారుతాయి. ఇటువంటి పరికరాలు హ్యాకర్లు మరియు మాల్వేర్లకు సులభమైన లక్ష్యంగా మారతాయి.