బెంగళూరు టెస్టులో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన 9వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. 1953లో మాధవ్ ఆప్టే (0,163), 1977లో గవాస్కర్ (0,118), 1979లో వెంగ్ సర్కార్ (0,103), 1989లో అజారుద్దీన్ (0,109), 1999లో సచిన్ (0,136), 2014లో ధావన్ (0,114), 2017లో కోహ్లీ (0,104), 2024లో గిల్ (0,119) ఈ ఫీట్ సాధించారు.