»Wedding Card With Dhoni Photo In Chhattisgarh Has Gone Viral
Dhoni Photo: అభిమానుల్లో ఇలాంటి వారు వేరయా.. పెళ్లి కార్డుపై ధోనీ ఫోటో
సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అభిమానుల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అందులో క్రికెటర్లకు ఉండే అభిమానులే వేరు. క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
Dhoni Photo : సెలబ్రిటీలకు అభిమానులు(Fans) ఉండడం సహజం. అభిమానుల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అందులో క్రికెటర్లకు ఉండే అభిమానులే వేరు. క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఓ అభిమాని ధోని పై ఉన్న ఇష్టాన్ని విచిత్రంగా చాటుకున్నాడు. ఏకంగా తన పెళ్లి కార్డు(wedding card)లో ధోనీ ఫోటో ముద్రించి తన గొప్ప అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని రాయ్‌గఢ్ జిల్లా(Raigarh district)లోని తమ్నార్కు చెందిన దీపక్(Deepak) ధోనీకి వీరాభిమాని. ఎంతలా అంటే తన పెళ్లి కార్డులో రెండు వైపులా ధోనీ ఫోటో వచ్చింది. పెళ్లి కార్డుపై తాలా అని రాశాడు. ఈ కార్డు ఇప్పుడు వైరల్‌గా మారింది. దీపక్కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ధోనిని ఉదాహరణగా తీసుకున్నాడు. క్రికెట్‌పై ఉన్న ఆసక్తి కారణంగా అతను తన గ్రామ క్రికెట్ జట్టు బాధ్యతలను తీసుకున్నాడు. అతను చాలాసార్లు తన జట్టును గెలిపించుకున్నాడు. అందరి మన్ననలు పొందాడు. ధోని లాంటి క్రికెటర్ చూపిన వ్యూహాలే తన విజయానికి కారణమని దీపక్ చెప్పాడు. ధోనీపై తనకున్న ప్రేమను తెలియజేయడానికి తన పెళ్లి సరైన వేదిక అని భావించాడు. తన కాబోయే భార్య గరిమాతో తన వివాహ వివరాలతో పాటు,పెళ్లి శుభలేఖ రెండు వైపులా ధోనీ ఫొటో ముద్రించాడు. ధోనీ జెర్సీ నంబర్ 7ను కూడా వేయించాడు. తల అని కూడా రాయించాడు. ధోనీని తమిళులు తల (నాయకుడు) అని పిలుచుకుంటారు.