»Team India On A Visit To Pradhana Mantri Sangrahalaya
Team India: ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ సందర్శనలో టీమిండియా
దేశ రాజధానిలోని పలు సందర్శనీయ ప్రాంతాల్లో టీమిండియా ఆటగాళ్లు(Team India cricketers) పర్యటించారు. విశిష్ట చరిత్ర కలిగిన ఈ సంగ్రహాలయాన్ని(PM Sangrahalaya) సందర్శించడం ఒక అరుదైన అవకాశమని భారత క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ(PM Sangrahalaya)కు విచ్చేసిన భారత క్రికెట్ జట్టు(India Cricket Team) ఆటగాళ్లను కేంద్రం సత్కరించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా(Team India) టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకూ రెండు మ్యాచ్ లు జరిగాయి. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకూ టీమిండియా(Team India) 2-0తో ముందంజలో ఉంది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్(Second Test Match)లో ఆస్ట్రేలియా జట్టును టీమిండియా రెండున్నర రోజుల్లోనే మట్టికరిపించింది. దీంతో మిగిలిన టైంలో దేశ రాజధానిలోని పలు సందర్శనీయ ప్రాంతాల్లో టీమిండియా ఆటగాళ్లు(Team India cricketers) పర్యటిస్తున్నారు.
పీఎం సంగ్రహాలయను సందర్శించిన టీమిండియా:
A walk through the corridors of history!
Exploring the rich legacy of India’s Prime Ministers, who rebuilt the nation post Independence. #TeamIndia had an immersive experience at the fascinating @PMSangrahalaya, which celebrates and showcases the journey of India. @PMOIndiapic.twitter.com/bcFICzXQOJ
తాజాగా భారత క్రికెట్ జట్టు ఢిల్లీలోని ప్రధాన మంత్రి సందగ్రహాలయ(PM Sangrahalaya)ను సందర్శించింది. ఇప్పటి వరకూ భారత దేశ ప్రధాన మంత్రులు వాడినటువంటి వివిధ వస్తువులను, వారి విలువైన సందేశాలను ఈ సంగ్రహాలయలో భద్రపరిచి ఉన్నారు. టీమిండియా ఆటగాళ్లు సంగ్రహాలయను సందర్శించి అనేక వస్తువులను పరిశీలించారు. వాటి చరిత్ర గురించి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ(PM Sangrahalaya)కు విచ్చేసిన భారత క్రికెట్ జట్టు(India Cricket Team) ఆటగాళ్లను కేంద్రం సత్కరించింది.
A trip to cherish! #TeamIndia visited the captivating @PMSangrahalaya, a unique museum dedicated to the Prime Ministers of India, illustrating the journey of India after Independence. @PMOIndia
విశిష్ట చరిత్ర కలిగిన ఈ సంగ్రహాలయాన్ని(PM Sangrahalaya) సందర్శించడం ఒక అరుదైన అవకాశమని భారత క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రధాన కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర ఆటగాళ్లంతా ఈ పర్యటనలో పాల్గొని పలు విషయాలను తెలుసుకున్నారు. భారత క్రికెటర్లు ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని(PM Sangrahalaya) సందర్శించిన సందర్భంగా బీసీసీఐ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడేందుకు సిద్దంగా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటి వరకూ టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉండగా మార్చి 1వ తేదిన ఇండోర్ లో మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.