»Team India Cricketers Under Pressure Harbhajan Singhs Key Comments
Harbhajan Singh: ఒత్తిడిలో టీమిండియా క్రికెటర్లు..హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals)కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియాను ఉద్దేశించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా క్రికెటర్లు(Teamindia Cricketers) తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) అన్నారు. భారత క్రికెటర్లలో ఐసీసీ(ICC) టోర్నీలను సాధించేందుకు అందరిలో ధైర్యం లోపించిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals) కోసం టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం కాస్త ఎక్కువనే అనిపించిందన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా(Team India)పై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీమిండియా(Team India) క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆయన పలు సూచనలు చేశారు. నైపుణ్యం లేకపోవడం అనే ప్రశ్నే లేదని, ఎన్ని కీలక మ్యాచ్లు ఆడితే అంత మెరుగుపడతారని అన్నారు. పెద్ద మ్యాచ్ల్లో ఎక్కువ స్వేచ్ఛతోటి ఆడాలని అన్నారు. జట్టు ఒత్తిడికి గురైందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆటగాళ్లు ఆడేందుకు వీలైనంత స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. వారిపై ఒత్తిడి పెంచితే సరిగ్గా ఆడలేరన్నారు.
అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే ఆత్మవిశ్వాసాన్ని ఆటగాళ్లలో కల్పించాలన్నారు. అలాంటి స్వేచ్ఛ ఉండటం వల్లే గతంలో తాము చాలా టోర్నీలను గెలిచినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం హర్భజన్ సింగ్(Harbhajan Singh) డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals)కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్స్లో ఆ జట్టు 469 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో భారత్(Team India) 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.