మరో ప్రపంచ రికార్డుకు చేరువలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో 6 సిక్సులు కొట్టి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో 3 సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టిస్తాడు.
Rohit Sharma Breaks Another Record At World Cup Final Match
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో ప్రపంచ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. రాజ్‌కోట్‌లో ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. మ్యాచ్ ఓడినప్పటికీ.. ఆస్ట్రేలియాపై ఆరు సిక్సులు బాదాడు హిట్ మ్యాన్. దీంతో ఫ్యాన్స్ కాస్త సంబర పడిపోయారు. వైట్ వాష్ చేయాలనుకొని.. చివరి మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని మాత్రం జీర్ణించుకోవడం లేదు.
ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడుగా ఆడాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. రోహిత్ (Rohit) హిట్టింగ్తో టీమిండియా ఫస్ట్ పవర్ ప్లేలో 72 రన్స్ చేసింది. కేవలం 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 13 ఏళ్ల తర్వాత పవర్ ప్లేలో 50కి పైగా పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. 2010లో గౌతమ్ గంభీర్ పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఘనతను సెహ్వాగ్ ఏడుసార్లు సాధించి ముందు వరసలో ఉన్నాడు. సచిన్, గంభీర్, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ ఒక్కొసారి చేశారు.
6 సిక్సులు బాది ఇంటర్నేషనల్ క్రికెట్లో 551 సిక్సర్లు కొట్టాడు రోహిత్ శర్మ(Rohit Sharma). హిట్ మ్యాన్ కన్నా ముందు విండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 553 సిక్సులు బాదాడు. అంటే రోహిత్ మరో 3 సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సిక్సులు కొట్టిన బ్యాట్మెన్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. వన్డే మ్యాచ్‌లో 5కి పైగా సిక్సర్లు కొట్టడం రోహిత్‌కు ఇది 17వ సారి.. అతని తర్వాత సచిన్ 8 సార్లు, గంగూలీ 7 సార్లు, సెహ్వాగ్ ఆరుసార్లు ధోని 5 సార్లు సిక్సులు కొట్టారు. సో.. అలా ఈ జాబితాలో రోహిత్ ముందు వరసలో ఉన్నాడు.