ఐపీఎల్ 2023(ipl2023) 53వ మ్యాచులో రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్‌కతా జట్టు పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ఎట్టకేలకు ఈ ఐపీఎల్ ప్లే-ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సోమవారం పంజాబ్ కింగ్స్(PBKS)ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన క్రమంలో ఈ ఘనతను సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన.. KKR ఆటగాళ్లలో కెప్టెన్ నితీష్ రాణా అర్ధ సెంచరీతో మంచి స్కోర్ చేయగా..డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ 23 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ క్రమంలో వచ్చిన రింకు సింగ్ 10 బంతుల్లో 21 స్కోర్ చేసి నాటౌట్‌తో గేమ్‌ను విజయంతో ముగించాడు.
మొదట బ్యాటింగ్ ఎంచుకున్నపంజాబ్ కింగ్స్(PBKS) ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. ధావన్ 57 రన్స్ మినహా ఏ ఒక్కరూ కూడా పెద్దగా స్కోర్లు చేయలేదు. అంతేకాదు కోల్ కతా బౌలర్లలో వరుణ్ చకరవర్తి అద్భుతంగా ఆడి 3 వికెట్లకు గాను 26 స్కోర్ మాత్రమే ఇచ్చాడు. హర్షిత్ రాణా 2, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.
ఇక క్వాలిఫికేషన్ కోసం జరిగిన పోరులో KKR విజయంతో బరిలోకి దిగింది. వారి నెట్ రన్ రేట్ ఆధారంగా ఆ లైనప్‌లోకి 11 పాయింట్లతో KKR ఐదవ జట్టుగా చేరింది. ఏది ఏమైనప్పటికీ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య బుధవారం జరగనున్న పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై కీలకం కానుంది. ఒక్కొక్కరు 10 పాయింట్లతో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ 11 పాయింట్లతో చేజింగ్ ప్యాక్ కంటే ఒక పాయింట్ మాత్రమే ఆధిక్యంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 13 పాయింట్లతో ఉంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఆరెంజ్ క్యాప్ పట్టికలో మొదటి ఐదు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే రింకూ సింగ్ 11 మ్యాచ్‌ల్లో 151.12 స్ట్రైక్ రేట్‌తో 337 పరుగులతో 10వ స్థానానికి ఎగబాకాడు. ఫాఫ్ డు ప్లెసిస్ 157.71 స్ట్రైక్ రేట్‌తో 511 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, యశస్వి జైస్వాల్ 160.60 స్ట్రైక్ రేట్‌తో 477 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
వరుణ్ చక్రవర్తి 3/26 అతనిని పర్పుల్ క్యాప్ పట్టికలో ఐదవ స్థానానికి చేరాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌లో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, సీఎస్కేలో తుషార్ దేశ్‌పాండే 19 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఎకానమీ ప్రాతిపదికన షమీ మొదటి స్థానంలో ఉండగా, తర్వాత రషీద్, దేశ్‌పాండే ఉన్నారు. పీయూష్ చావ్లా 17 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.