»Rcb Vs Lsg Ipl 2023 Pooran Shines In Lsgs Last Ball Win Over Rcb In Chase Of 213 Score
IPL క్షణం క్షణం ఉత్కంఠ.. ఆఖరి బంతికి గట్టెక్కిన లక్నో
ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో జట్టును విజయతీరాల అంచున నిలిపారు. వీరిద్దరూ వెళ్లిపోయిన సమయంలో స్కోర్ 189/6 ఉంది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
పొట్టి క్రికెట్ (Cricket)లో భారీ లక్ష్యం చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదే (Royal Challengers Bangalore-RCB) విజయమని అందరూ ఖాయం చేసుకున్నారు. డుప్లెసిస్ (79) (Faf du Plessis), కోహ్లీ (61) (Virat Kohli), గ్లెన్ మాక్స్ వెల్ (59) అర్ధ శతకాలతో రెచ్చిపోయినా వారిని లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants- LSG) నిలువరించింది. భారీ స్కోర్ లక్ష్యంగా విధించినా లక్నో ఉఫ్ అని ఊదేసింది. ఫలితంగా లక్నో మూడో విజయాన్నందుకోగా.. బెంగళూరు రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఒక్క వికెట్ తేడాతో ఆర్సీబీపై ఎల్సీజీ అజేయ విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు తరఫున డుప్లెసిస్ (46 బంతుల్లో 79, 5 ఫోర్లు, 5 సిక్స్ లు) ధాటిగా ఆడగా.. కెప్టెన్ కోహ్లీ (44 బంతుల్లో 61, 4 ఫోర్లు, 4 సిక్స్ లు), మ్యాక్స్ వెల్ (29 బంతుల్లో 59, మూడు ఫోర్లు, 6 సిక్సర్లు) భారీగా పరుగులు (Score) రాబట్టారు. ముగ్గురు బ్యాట్ తో విధ్వంసం సృష్టించడంతో బెంగళూరు అభిమానులు (Fans) పండుగ చేసుకున్నారు. 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారీ లక్ష్యం విధించడంతో ఇక తమదే విజయమని కోహ్లీ అభిమానులు భావించారు.
కానీ లక్నో సూపర్ జెయింట్స్ వారి అంచనాలను తలకిందులు చేసింది. ఓపెనర్ కేల్ మేయర్స్ (Kyle Mayers) డకౌట్ కాగా.. కెప్టెన్ రాహుల్ (18), దీపక్ హుడా స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరారు. కృనాల్ పాండ్యా ఒక్క పరుగు చేయలేదు. ఈ సమయంలో మార్కస్ స్టోయినిస్ (65), నికోలస్ పూరన్ (62) వచ్చి రెచ్చిపోయారు. ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో జట్టును విజయతీరాల అంచున నిలిపారు. వీరిద్దరూ వెళ్లిపోయిన సమయంలో స్కోర్ 189/6 ఉంది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ సమయంలో ఆయూష్ బదోని (30) (Ayush Badoni) చక్కటి బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి బంతి వరకు పోరాటం ఆగలేదు. ఐపీఎల్ (IPL) ఆట అసలైన మజాను ఆర్సీబీ, లక్నో మ్యాచ్ అందించింది. క్షణం ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ లో లక్నో పైచేయి సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది.