Petra Kvitova: తల్లి కాబోతున్న గ్రాండ్స్లమ్ ఛాంపియన్
రెండుసార్లు వింబుల్డన్ గ్రాండ్స్లమ్ ఛాంపియన్ పెట్రా క్విటోవా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది బిడ్డను స్వగతించబోతున్నామని 33 ఏళ్ల క్విటీవా పేర్కొంది.
Petra Kvitova: రెండుసార్లు వింబుల్డన్ గ్రాండ్స్లమ్ ఛాంపియన్ పెట్రా క్విటోవా కొత్త సంవత్సరం రోజున శుభవార్త తెలిపింది. నూతన సంవత్సరం రోజ తన అభిమానులతో ఓ శుభవార్త పంచుకుంది. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. 2024 మొదటి రోజున మీకు శుభవార్త తెలుపుతున్నారు. రానున్న వేసవిలో జిరి, నేను మా కుటుంబంలోకి ఒక బిడ్డను స్వాగతించబోతున్నామని 33 ఏళ్ల క్విటీవా పేర్కొంది. తన కోచ్ జిరి వానెక్ను క్విటోవా గతేడాది వివాహం చేసుకుుంది. అయితే డిసెంబర్లో ప్రకటించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎంట్రీల జాబితాలో క్విటోవా పేరు ఉంది. ఈమె గర్భం నేపథ్యంలో ఈనెల 14న ప్రారంభమయ్యే గ్రాండ్స్లమ్లో ఆమె ఆడుతుందా? లేదా? అనే విషయం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.