నేడు భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ 108 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ దూకుడుగా ఫీల్డింగ్ చేసింది. టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. భారత్ బౌలర్లు పదునైన బౌలింగ్ తో 34.3 ఓవర్లలోనే కివీస్ ను ఆలౌట్ చేశారు. షమీ, సిరాజ్ కు తోడు ఆల్ రౌండర్లు అయిన హార్దిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ లు వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ వరుస ఓవర్లలో రెండు వికెట్లను తీసి కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. దీంతో 34.3 ఓవర్లలో కివీస్ 108 పరుగులు చేసింది.