»Indian Womens Team To The Final Of The Asian Games 2023
Asian Games 2023:లో ఫైనల్ కు భారత ఉమెన్స్ టీం..పతకం పక్కా
భారత్ క్రికెట్లో చారిత్రాత్మక పతకాన్ని ఉమెన్స్ టీమిండియా ఖాయం చేసుకుంది. తొలిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొని సెమీ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక రేపటి ఫైనల్ మ్యాచులో గెలుస్తుందో లేదో చూడాలి మరి.
ఆసియా క్రీడలు 2023(Asian Games 2023)లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో క్రికెట్లో తమ తొలి ఆసియా క్రీడల పతకాన్ని ఖాయం చేసుకున్న జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లను పడగొట్టి అదిరిపోయే ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ టీంను 51 పరుగులకే కట్టడి చేసింది.
బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ 17.5 ఓవర్లలో 51 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన జట్టు 8.2 ఓవర్లలో ఆ టోటల్ స్కోర్ ను చేధించి సోమవారం జరగాల్సిన ఫైనల్కు చేరుకుంది. ఆసియా క్రీడలు 2023 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని హాంగ్జౌలో శనివారం ప్రారంభయ్యాయి. ఈ విజయంతో ఆసియా క్రీడల క్రికెట్ టోర్నమెంట్లో భారత్కు తొలి పతకం ఖాయమైంది. ఇక ఫైనల్లో ఉమెన్స్ టీమిండియా పాకిస్థాన్ లేదా శ్రీలంకతో జట్టుతో ఆడే అవకాశం ఉంది.
రెండో టీ 20లోనూ భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.