రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 328 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో తన తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. దేశవాళీ క్రికెట్లో పాటిదార్ ఈ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తే, అతడు త్వరలోనే టీమిండియాలోకి తిరిగి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.