రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్లో ఆడి దారుణంగా విఫలమవడంతో రేపటి మ్యాచ్‌లో జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. దీంతో ఫామ్‌లో ఉన్న రాహుల్ వన్ డౌన్ ఆడనున్నాడు. మరోవైపు నితీష్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.