ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఠానెలోని ఓ ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చికిత్స పొందుతున్నారు. పలు టెస్టులు జరిపిన డాక్టర్లు అతని మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక్కడి డాక్టర్ల వల్ల బతికి ఉన్నానని ఆసుపత్రి బెడ్‌పై నుంచి కాంబ్లీ పేర్కొన్నారు.