టీమిండియా పేసర్ షమీని కివీస్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్ అయ్యాడు. 200 ఓవర్లు వేసి ఫిట్నెస్ నిరూపించుకున్నా.. సెలక్టర్లు ఇంకా ఏం కోరుకుంటున్నారని ప్రశ్నించాడు. షమీ లాంటి సీనియర్ బౌలర్‌ను పక్కన పెట్టడం సరికాదన్నాడు. ‘షమీ పాత రిథమ్‌తో బౌలింగ్ చేస్తే.. తన రీఎంట్రీని ఎవరూ అడ్డుకోలేరు’ అని పఠాన్ అన్నాడు.