Cristiano Ronaldo's rude behavior in Saudi Arabia League 2023 match.. Board fined
Cristiano Ronaldo: స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) అంటే తెలియని వారుండరు. తాజాగా ఆటలో తన ప్రవర్తన తీరుపై లీగ్ బోర్డు షాకింగ్ డిసిషన్ ఇచ్చింది. మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఒక మ్యాచ్ నిషేధంతో పాటు రూ. 2 లక్షల జరిమానా పడింది. సౌదీ అరేబియా లీగ్(Saudi Arabia Legue 2023) జరుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి 25న అల్ నస్రీ, అల్ షాబాద్ జట్లు నడుమ మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అభిమానులు మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే గోల్ కొట్టి సెలబ్రెట్ చేసుకుంటున్న రొనాల్డో వాళ్లకు అసభ్యకరమైన గెశ్చర్ చూపించాడు. ఏం పిక్కుంటారో పిక్కోండి అనేలా ఆ అక్టివిటీ ఉంది. అతని తీరుపై అల్ షాదాబ్ క్లబ్ క్రమశిక్షణ, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది.
రొనాల్డో ప్రవర్తనను విశ్లేషించిన సౌదీ లీగ్ క్రమశిక్షణ, ఎథిక్స్ కమిటీ అతడిపై చర్యలు తీసుకుంది. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు 10,000 సౌదీ రియాల్స్(మన కరెన్సీలో రూ.2 లక్షలు) జరిమానా విధించింది. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు అయిన అల్ షాదాబ్‌కు రూ. 4 లక్షలు చెల్లించాల్సిందిగా రొనాల్డోను ఆదేశించింది. తమ తీర్పును అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేదని చెప్పింది. ఈ పోరులో రొనాల్డో సారథ్యం వహిస్తున్న అల్ నస్రీ క్లబ్ 3-2తో గెలుపొందింది.