సిడ్నీ టెస్టు సందర్భంగా తొలి రోజు ఆట ముగిసే సమయంలో బుమ్రా, ఆసీస్ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ గొడవపై రిషభ్ పంత్ స్పందించాడు. సమయం వృథా చేయాలనే వ్యూహంలో భాగంగానే బుమ్రాతో కొన్స్టాన్ గొడవకు దిగాడని పంత్ అభిప్రాయపడ్డాడు. మరో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని కొన్స్టాన్ భావించినట్లు పేర్కొన్నాడు.