న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 34 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. సర్ఫరాజ్, పంత్ దూకుడు బ్యాటింగ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో 4.64 రన్‌రేట్‌తో 99.3 ఓవర్లలో భారత్ 462 పరుగులు చేసింది. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 450+ స్కోరు చేసిన ఘనత సాధించింది. గతంలో 1990లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్పైనే 4.61 RRతో భారత్ 482 పరుగులు చేసింది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది.