రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా(Team India) రెండో రోజు పర్వాలేదనిపించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్(2nd innigs)లో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేయగలిగింది.
రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా(Team India) రెండో రోజు పర్వాలేదనిపించింది. ఢిల్లీలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఓవర్ నైట్ స్కోర్ 21/0తో రెండో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. అంతకుముందు తొలి రోజు ఆస్ట్రేలియా 263 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రెండో రోజు బరిలోకి దిగిన భారత బ్యాటర్లు 262 పరుగులు చేసి ఆటౌల్ అయ్యారు. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ 74 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 44, అశ్విన్ 37 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 32, రవీంద్ర జడేజా 26 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.
ఆసీస్ బౌలర్లలో లియాన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు అయిన కుహ్నెమన్, మర్ఫీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇకపోతే రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్(2nd innigs)లో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేయగలిగింది. దీంతో 62 పరుగుల ఆధిక్యంతో ఆసీస్ నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్ 39, లబూషేన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
.@akshar2026 scored a clinical momentum-changing knock of 7️⃣4️⃣ as he becomes #TeamIndia's Top Performer from the first innings 👌👌
అంతకముందు ఓవర్నైట్ స్కోర్ 21/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా(Team India) వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ భారత బ్యాటర్ల వికెట్లను వరుసగా పడగొట్టాడు. వరుసగా 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా(Team India) ను కోహ్లీ(Virat Kohli), జడేజా(Jadeja)లు ఆదుకున్నారు. ఇద్దరూ నిలకడగా ఆడి స్కోరును ముందుకు నడిపించారు. మ్యాచ్ చివర్లో అక్షర్ పటేల్(74), అశ్విన్(37) ఎనిమిదో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ 262 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రేపటి మ్యాచ్ లో రెండో టెస్ట్ విజేత ఎవరో తేలనుంది.