సిడ్నీ వేదికగా జరుగుతోన్న AUS-ENG ఐదో యాషెస్ టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ENG 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జోరూట్(72*), బ్రూక్(78*) అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. ENG స్కోరు 211/3 వద్ద ఉండగా.. భారీ వర్షం రావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ప్రస్తుతం ఆసీస్ సిరీస్లో 3-1తో ఆధిక్యంలో ఉంది.