ఆసియా కప్-2025లో పాకిస్తాన్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. పసికూన UAEని ఓడించి లీగ్ దశను ముగించింది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తాము ఏ జట్టునైనా ఓడిస్తామని తెలిపాడు. తమ బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందన్నాడు. షాహిన్ అఫ్రిది బ్యాటింగ్ మెరుగుపడిందన్నాడు. ఈ క్రమంలో మున్ముందు ఏ జట్టునైనా తాము ఓడిస్తామని చెప్పాడు. కాగా, భారత్తో పాక్ మరోసారి తలపడనుంది.