AP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీకి టీడీపీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.