VZM: బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నాగభూషణం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈయన ప్రస్తుతం తెర్లాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ భవ్యా రెడ్డితో పాటు పలువురు పోలీస్ అధికారులు నివాళులు అర్పించారు. అలాగే డీఎస్పీ చేతుల మీదుగా పోలీస్ శాఖ నుంచి ఆర్ధిక సాయం అందించారు.