ఖేల్ రత్న అవార్డుల నామినేషన్ల జాబితాలో షూటర్ మనూ బాకర్‌కు చోటు దక్కిని విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఏదో లోపం జరిగి ఉండొచ్చని.. దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఒక అథ్లెట్‌గా దేశం కోసం ఆడటం తన బాధ్యత అని వెల్లడించారు. అవార్డులు తనకు స్ఫూర్తినిస్తాయే.. కానీ, అవే తన లక్ష్యాలు కాదని నెట్టింట పోస్ట్ చేశారు.