బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఖరి బాగోలేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. జడేజాను తక్కువగా అంచనా వేస్తూ రోహిత్ కెప్టెన్సీ చేస్తున్నాడని ఆరోపించాడు. రెండో టెస్టు మొదటి రోజు జడేజాకు రోహిత్ బంతి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిసారి అశ్విన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాడని అన్నాడు. జడేజా కూడా నాణ్యమైన బౌలర్ అని అన్నాడు.