మరో వారం రోజుల్లో బంగ్లాతో ప్రారంభంకానున్న 3 టీ20ల సిరీస్కు భారత జట్టు ఖరారు అయింది. సూర్య కుమార్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. పంత్కు రెస్ట్ ఇవ్వడంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ చోటు దక్కించుకున్నారు. జట్టు: అభిషేక్ శర్మ, జైశ్వాల్, శాంసన్, సూర్యకుమార్, పరాగ్, హార్ధిక్, రింకూ సింగ్, శివమ్ దూబె, బిష్ణోయ్, అర్షదీప్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ, నితీశ్ కుమార్.