ఇప్పటి వరకు మనం వాడే బైకులన్నీ పెట్రోల్ సాయంతోనే నడుస్తాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా పెట్రోల్, కరెంటుతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.
మైట్రోకాన్డ్రియాల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన మహిళా దాతలనుంచి తీసుకున్న ఎగ్స్ ను తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
మహిళలు 40 ఏళ్ల తర్వాత బరువు పెరగడం సర్వసాధారణం.. పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల మహిళలు బరువు పెరుగుతారు. చాలా మంది స్త్రీల పొత్తికడుపు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు పెరిగే వారు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. రోగాలు వచ్చి అవస్థలు పడాలని, ఆస్పతుల చుట్టూ తిరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజుల్లో మనం తీసుకునే ఆహారం మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు తెలీకుండానే మనమంతా కల్తీ ఆహారాలు తీసుకుంటున్నాం. నిజానికి అధికారులు సరిగా తనిఖీలు చేస్తే ఈ కల్తీ బండారం త్వరగా బయటపడుతుంది. కానీ అది సరిగాలేకపోవడం వల్ల కల్తీ రాజ్యం ఏలుతోంది.
పెళ్లిళ్లు స్వర్గం(Heaven)లో నిశ్చయం అవుతాయంటారు. ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో చెప్పడం కష్టం. మన దేశంలో చాలా పెళ్లిళ్లను పెద్దలు కుదుర్చుతారు. పరిచయం ఉన్న వారిని పెళ్లి(Marriage) చేసుకున్నా పెళ్లి తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి.
ఖమ్మం జిల్లాలోని 49 ఏళ్ల వ్యక్తి రాయల సతీష్ తన 17 ఏళ్ల కూతురితో కలిసి నీట్ పరీక్ష రాశాడు. ఎంబీబీఎస్ పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలిపాడు.
ఈ రోజుల్లో ఫోన్ చేతిలో లేనివారు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఫోన్ లేపోవడం కాదు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం టెక్నాలజీకి దగ్గరగా ఉండటమని భావిస్తున్నారు. కానీ, ఈ ఫోన్ల కారణంగా మనం ఎన్ని సమస్యలు ఎదుర్కుంటున్నామో ఎవరూ ఊహించడం లేదు.
అరాచక పాలన సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలంతా (MLAs) పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) చోటుచేసుకున్న పరిణామాలే సాక్ష్యం. ముగ్గురు కీలకమైన ఎమ్మెల్యేలు, జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న నేతలు పార్టీపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసింద...
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో మాట్లాడుతుండగా.. వెనకాల కేసీఆర్ నిల్చొని ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ చిన్నారి తన వీపుపై తాబేలు పెంకులా ఉండే భిన్నమైన నిర్మాణంతో జన్మించాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఏ ఆహారం తినాలని ఉన్నా.. కడుపు నిండిన భావన కలిగి, ఆగకుండా తేన్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు పొట్ట మొత్తం అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా వేగంగా ఆహారం తినడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం, అతిగా తినడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, మలబద్ధకం వంటి అనేక అంశాలు ఉబ్బరం పెరగడానికి దోహదపడతాయి.
Gold : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్ లో కొనుగోళ్ల రూపంలో 24 వేల టన్నుల బంగారం ఉంది. అందులో 21 వేల టన్నుల బంగారం మహిళలదే.
మూణ్నాళ్ల పార్టీ.. వచ్చేది లేదు.. కేసీఆర్ వలన కాదు.. హే ఇది ఉప ఎన్నికల పార్టీ అని అవహేళన చేసిన వారు.. నేడు వారు నివ్వెరపోయేలా బీఆర్ఎస్ పార్టీ అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం సందర్భంగా ప్రత్యేక కథనం.. చదవండి
గతంలో ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులుగా పని చేసిన వారిని కేసీఆర్ తన వెన్నంటే ఉంచేసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ ను అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో మధుబని లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
భారతదేశపు తొలి వాటర్ మెట్రోను మంగళవారం కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 చిన్న దీవులు ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కింద అనుసంధానించబడతాయి. ఈ ద్వీపాలను అనుసంధానించడానికి ఉపయోగించే అన్ని పడవలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి హైబ్రిడ్ శక్తితో నడుస్తాయి.