సరిగ్గా నెల రోజుల క్రితం బీజేపీ పార్లమెంటరీ విస్తారక్ సమావేశం బీహార్‌లో జరిగింది. ముఖ్యమంత్రి, జనతా దళ్ అధినేత నితీష్ కుమార్‌పై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. యాంటీ బీజేపీ ఫోర్స్‌కు నితీష్ కీలక నేతగా ఉండటంతో టార్గెట్ చేసింది. ఇప్పుడు మళ్లీ నెల రోజుల తర్వాత పార్లమెంటరీ విస్తారక్ సమావేశాన్ని బుధ, గురువారాలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి, కర్నాటక,...