పర్వతారోహకురాలు మేఘా పర్మార్‌ను మే 10న బేటీ బచావో బేటీ పఢో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్‌గా తొలగించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ప్రపంచంలోని అందమైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా ఇదే. అయితే, తాజాగా ఈ నగరం గురించి ఓ విస్తుపోయే నిజం తెలిసింది. ఈ నగరం భూమిలోకి కుంగిపోతోందట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ నగరం ప్రతిసంవత్సరం కుంగిపోతోందట. అందుకు అక్కడ ఉన్న ఎత్తైన భవనాలే కారణం. ఆ ఎత్తైన భవనాల వల్ల భూమిపై ఒత్తిడి ఎక్కువగా పడుతోందట. దీని వల్ల అక్కడ భూమి కుంగిపోతోందని పరిశోధనల్లో తేలింది.
చిన్నపాటి విషయానికే రెండు కుటుంబాలు పిడిగుద్దులను కురిపించుకున్నాయి. ఢిస్నీ వరల్డ్ లో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ ఫ్యామిలీపై మరో ఫ్యామిలీ దాడిచేసింది.
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. జనతాదళ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండో సారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు.
హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది మందుల్లోనో లేక వైద్యంలోనో లేదనే నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని అంటున్నారు. మనిషి అధిక ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతమైన జీవితానికి అలవాటుపడ్డప్పుడు ఆరోగ్యం కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు.
వేసవికాలం (Summer time) వచ్చిందంటే చాలు అందరిచూపు మామిడికాయ పచ్చడి మీదే ఉంటుంది. ఇటీవలే ఈదురుగాలులకు మామిడి కాయలు దెబ్బతిని కొంత కొరత ఏర్పడటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పచ్చడి మామిడికాయ ఒకటి రూ.6 నుంచి రూ.10 వరకు పలుకుతున్నది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు(temparature) 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.