»Revanth Reddy Said Jobs Are Not Mentioned In Kcr Manifesto 2023
Revanth Reddy: కేసీఆర్ మ్యానిఫెస్టోలో జాబ్స్ ప్రస్తావనే లేదు
తెలంగాణలో నిరుద్యోగ యువత ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనేక హామీలను పెంచిన కేసీఆర్..ఉద్యోగాల విషయంలో మాత్రం అలా చేయలేదన్నారు. అంతేకాదు వాటి ప్రస్తావనే లేదన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రంలో నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని రేవంత్ కోరారు.
Revanth Reddy said Jobs are not mentioned in KCR manifesto 2023
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy )బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచడమే కేసీఆర్ విధానమని అన్నారు. అంతేకాదు గతంలో మునుగోడులో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే అమలు చేసినట్లు గుర్తు చేశారు. మరోవైపు ఇటివల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థి ప్రవళిక విషయంలో కూడా ప్రభుత్వం దారణంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. అసలు ప్రభుత్వ అధికారులకు దిశా చట్టం, నిర్భయ యాక్ట్ గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. ఎక్కడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు అమ్మాయిల విషయంలో కొన్ని చెప్పకూడని అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. కానీ ఈ కేసు విషయంలో ఓ ప్రభుత్వ అధికారి సమాజంలో ఆ కుటుంబం తలెత్తుకోలేని అంశాలని బహిర్గతంగా చెప్పాడని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అసలు అధికారిని వదిలిపెట్టి వేరే అతన్ని సస్పెండ్ చేశారని రేవంత్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసింది కేసీఆర్ కు చుట్టపు అధికారులేనని రేవంత్ వ్యాఖ్యానించారు.
అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు అమరవీరుల స్థూపాన్ని సందర్శిస్తే తప్పెంటని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి మ్యానిఫెస్టోలో తాము చెప్పిన అన్ని అంశాలను పెంచుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు. మేము రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామంటే రూ.16 వేలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్పిందన్నారు. మేము ఫించన్ రూ.4 వేలు ఇస్తామని చెబితే బీఆర్ఎస్(BRS) 5 వేలు ఇస్తామని హామీ ఇచ్చాందని గుర్తు చేశారు. అయితే ప్రతి దాంట్లో పెంచి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉద్యోగాల విషయంలో అలా చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రెండు లక్షల ఉద్యోగాల కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెబితే వాటి గురించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. అసలు నియామాకాల సబ్జెక్ట్ కేసీఆర్ ఎజెండాలో లేదన్నారు. దీంతోపాటు జీవన భృతి అంశం కూడా లేదన్నారు. ఈ క్రమంలో దిక్కుమాలిన, నీతిమాలిన చర్యలకు చంద్రశేఖర్ రావు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు గుర్తించాలని రేవంత్ కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఉడగోడితేనే మీకు ఉద్యోగ భద్రత వస్తుందని రేవంత్ అన్నారు. ఈ క్రమంలో 30 లక్షల మంది నిరుద్యోగులు వారి పేరెంట్స్ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయించాలని కోరారు. అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి 90 లక్షల ఓట్లతోపాటు 90 సీట్లు వస్తాయని అన్నారు. దీంతో కాంగ్రెస్(congress) ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 9 నుంచి 2024 డిసెంబర్ 9న ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు(JOBS) భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విధానం కూడా అమలు చేస్తామన్నారు.