»Jagan Not Accept To Avinash Reddy Arrest Says Cpi Leader K Narayana
Avinash Reddy అరెస్ట్ ఉండదు.. జగనే అడ్డుకుంటుండు: నారాయణ సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్య కేసులో ఎంపీ అనివాశ్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదు. అరెస్ట్ ను అడ్డుకోవడానికి సీఎం జగన్ ఎంతదాకైనా వెళ్తాడు. హత్య చంద్రబాబు హయాంలో జరిగింది. ఆనాడే అవినాశ్ ను అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు.
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్ ఇప్పట్లో ఉండదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K Narayana) సంచలన ప్రకటన చేశారు. అవినాశ్ అరెస్టును అడ్డుకునేందుకు సీఎం జగన్ (Jagan) ఎంత దూరమైనా వెళ్తాడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ చేసిందేమీ లేదని కొట్టి పారేశారు. ఆమె కుమార్తె డాక్టర్ సునీత (Suneetha Narreddy) పట్టుదలతో కేసు ఇంత దాకా వచ్చిందని పేర్కొన్నారు.
కడప జిల్లాలోని (Kadapa) సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో నారాయణ వివేకా హత్య కేసు (Viveka Murder Case) విషయంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘వివేకా హత్య కేసులో ఎంపీ అనివాశ్ అరెస్ట్ (Arrest) ఇప్పట్లో ఉండదు. అరెస్ట్ ను అడ్డుకోవడానికి సీఎం జగన్ ఎంతదాకైనా వెళ్తాడు. హత్య చంద్రబాబు (Nara Chandrababu Naidu) హయాంలో జరిగింది. ఆనాడే అవినాశ్ ను అరెస్ట్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు. ఆ హత్య కేసు ఇంత తీవ్రం కావడానికి కారణం సీబీఐ కాదు. సీబీఐ చేసిందేమీ లేదు. వివేకా కుమార్తె సునీత పట్టుదలతో హత్య కేసులో ఇంత పురోగతి వచ్చింది’ అని నారాయణ స్పష్టం చేశారు.
‘సీబీఐ సీఎం జగన్ ముందు మోకాలు (Knee) వంచితే.. అమిత్ షా వద్ద జగన్ మోకాలు వంచారు. పులివెందులలో ఏ పూలమొక్కను అడిగినా వివేకాను ఎవరు చంపారో చెబుతుంది. వైఎస్ కుటుంబం అనుమతి లేకుండా పులివెందులలో ఒక్క చీమ (Ant) కూడా కుట్టదు’ అని నారాయణ తెలిపారు. గాలి జనార్ధన్ రెడ్డి కంటే అవినాశ్ గొప్ప, శక్తిమంతుడు కాదని కొట్టిపారేశారు. వేరే రాష్ట్రాల్లో ఒక ఎంపీ ఇలాంటి కేసులో చిక్కి ఉంటే ఎప్పుడో సీబీఐ అరెస్ట్ చేసేదని చెప్పారు. కానీ ఒక్క ఏపీలోనే (AP) విరుద్ధంగా జరుగుతుందని గుర్తు చేశారు.