TG: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన చేయొద్దని తాము అనటం లేదని పేర్కొన్నారు. మూసీ కంపును కడగమని చెబుతున్నట్లు తెలిపారు. అందులో స్వచ్ఛమైన నీరు పారాలని నల్గొండ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాగా, మూసీ నిర్వాసితులకు ఇళ్లు ఇస్తుంటే ఈటల రాజేందర్‌కు ఎందుకు ఇబ్బందిగా ఉందని సీఎం రేవంత్ అన్నారు.