TG: ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మూసీ కుట్రలను బయటపెట్టినందుకే KTR కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ పేర్కొన్నారు. అసలు పార్టీ జరిగింది ఫామ్‌హౌస్ కాదు.. రాజ్ పాకాల కొత్తగా కట్టిన ఇల్లు అని హరీష్ రావు తెలిపారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్దులు ఉంటారా? అని ప్రశ్నించారు.