స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. కివీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌లో మూడుసార్లు స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. స్పిన్నర్లు జడేజా, కులీదీప్ బౌలింగ్‌లో కోహ్లీ గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా, స్పిన్నర్లకు అనుకులించే వాంఖడే పిచ్‌పై కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తిగా మారింది.