ప్రధాని మోదీతో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్చెజ్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. వడోదరలో జరిగిన సమావేశంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారం తీసుకోనున్నట్లు వెల్లడించారు.