TG: కరీంనగర్లో వింత సంప్రదాయం కొనసాగుతోంది. కార్ఖానా గడ్డలో ఉన్న కొన్ని దళిత కుటుంబాలు ప్రతియేటా శ్మశాన వాటికలోనే దీపావళి వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు. చనిపోయిన తమ పెద్దలను గుర్తు చేసుకుంటూ సమాధుల మధ్య వేడుకలు జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందే తమ పెద్దల సమాధులను శుభ్రం చేసి పూలతో అలంకరించి అక్కడే టపాసులు కాలుస్తారు. అయితే గత ఆరు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు.