AP: పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.18 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 16 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.